![]() |
![]() |
.webp)
ఒక షోలో గానీ ఏదైనా సీరియల్ లో గానీ తమ నటనకి ఇంప్రెస్ అయితే బాగుందని నెటిజన్లు చెప్తారు. అదే బాలేదంటే ట్రోల్స్ చేస్తారు. అది బయట కామన్. కానీ అదే రిపీటెడ్ గా జరిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు అదే విషయం తెలియజేస్తూ బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
అసలు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసిందో ఓసారి చూసేద్దాం.. ప్లీజ్ డోంట్ మేక్ ఎనీథింగ్ సీరియస్(ఇన్ స్టా పోస్ట్ అండ్ కామెంట్స్). మేము ప్రతీ షోలో మా తోటి ఆర్టిస్ట్ లతో సరదగా ఉంటాం.. అందరం ఎంజాయ్ చేస్తాం.. మేం షోలో ఎంటర్‌టైన్మెంట్ కోసమే ఒకరినొకరం కామెంట్ చేసుకుంటాం.. కానీ మీరు దానిని నెగెటివ్ తీసుకోకండి.. నెగెటివ్ కామెంట్లు చేయకండి. మేము మీకు వినోదం పంచడం కోసమే ఇలా ఫన్ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ లు చేస్తాం.. అలా సరదాగా మాటలు మాట్లాడతామని దీపిక అంది.
.webp)
మీరు నిజంగా మా ఫ్యాన్స్ అయితే.. ప్లీజ్ ఎవరిని తక్కువగా చూడకండి(Please Don't Disrespect) అంటు దీపిక రాసుకొచ్చింది. మేమేదో సరదగా అలా మాట్లాడేవాటిని సీరియస్ చేయకండి. మీరు ఫ్యాన్స్ అయితే నా తోటి సీరియల్ ఆర్టిస్ట్ లని గౌరవించండి అంతే కానీ ఇలా ఫ్యాన్ పేజీలు పెట్టి వేరే వాళ్లని తిట్టకండి. సీరియల్ నటీనటులని తక్కువగా చూస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి పోస్ట్ లు చేయకండి అంటు కావ్య అలియాస్ దీపిక రంగరాజు పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
![]() |
![]() |